- అర్ధరాత్రి దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
- సోఫాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధం
శేరిలింగంపల్లి, డిసెంబర్ 2: చందానగర్ పీఎస్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద ఉన్న సోఫా తయారీ షాప్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్‌లోని సోఫాలు, ఇతర సామాగ్రి పూర్తి గా కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. పక్కన ఉన్న దుకాణాలు, ఇండ్లకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు.