calender_icon.png 28 December, 2024 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపునగర్ లో అగ్నిప్రమాదం

02-12-2024 07:18:04 PM

షాపులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

షాపులోని సోఫాలు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): సోఫా తయారీ షాపులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గుల్మొహర్ పార్క్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. మహావీర్ సోఫా వర్క్స్, మస్కిటో డోర్స్ షాప్ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. ఈ షాపులో  ఒక్కసారిగా అర్ధరాత్రి పూట మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి దాటాక ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. షాపులోని సోఫాలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలీ బూడిదయ్యాయి. ఈ మేరకు స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పివేశారు. పక్కనే ఉన్న ఇళ్లల్లో, షాపులకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రదానికి విద్యుత్ ఘాతం కారణం కవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.