calender_icon.png 2 February, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలానగర్‎లో భారీ అగ్నిప్రమాదం

02-02-2025 10:50:43 AM

హైదరాబాద్: నగరంలోని బాలానగర్(Balanagar) పరిధిలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. దాసరి సంజీవయ్య(Dasari Sanjeevaiah Colony)కాలనీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని సాయి సత్యశ్రీనివాస్ (30) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతుడిని రాజమహేంద్రవరానికి చెందిన సాయి సత్యశ్రీనివాస్ గా గుర్తించారు. పటాన్ చెరు రుద్రారం(Patancheru Rudraram)లోని రసాయన పరిశ్రమలో సాయి పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.