24-04-2025 02:19:13 PM
టాటా సర్వీస్ స్టేషన్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
కుత్బుల్లాపూర్,(విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని టాటా సర్వీస్ మోటర్స్ లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీని అనుకుని మియాపూర్ హైవే పై భారీ షెడ్ నిర్మించి అందులో టాటా మోటర్స్ సర్వీస్ స్టేషన్, టాటా సేల్స్ స్టేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ ఉండేలా నిర్మించలేదు. రాజకీయ పలుకుబడి కలిగిన ఓ నాయకుడు ఇలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్ నిర్మించడమే కాక అందులో ప్రతి నెల లక్షలు కిరాయిలు దండుకుంటూ ధర్జాగా సొమ్ముచేసుకుంటున్నాడు.
నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భారీ షెడ్ లో అగ్ని ప్రమాదం జరిగి కోట్ల రూపాయల ప్రజల సొత్తు కాలి బూడిద అయినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. ఎన్ని కార్లు బూడిద అయ్యాయో, ఎంత ప్రజా నష్టం వాటిల్లినదో తేలాల్సి ఉంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు ఆర్పెందుకు ప్రయత్నిస్తున్నారు.రేణుకా ఎల్లమ్మ కాలనీ ని ఆనుకుని ఈ భారీ షెడ్ ఉండడంతో స్థానికులు ఫైర్ ఆక్సిడెంట్ పట్ల భయాందోళనకు గురవుతున్నారు.