calender_icon.png 4 January, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప సోసైటీ లోనీ ఓ ఐటి కంపెనీలో అగ్నిప్రమాదం..!

01-01-2025 08:04:03 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనం 5వ అంతస్తులో నిపున్‌ ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పనిచేస్తున్న ఉద్యోగస్తులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. కాగా, అగ్ని ప్రమాదంలో ఆఫీస్ లోని సామగ్రి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు పూర్తిగా అగ్నికి ఆహుతమయ్యాయి. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.