మంటల్లో దగ్ధమైన స్క్రాప్ కంటైనర్లు
ఎల్బీనగర్, ఫిబ్రవరి 6: ఆటోనగర్ పారిశ్రామిక వాడలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు స్క్రాప్ కంటైనర్లు దగ్ధమయ్యాయి. ఆటోనగర్‌లోని ఒక గోదామ్‌కు స్క్రాప్ లోడ్‌తో రెండు భారీ కంటైనర్లు వచ్చాయి. రెండు కంటైనర్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హయత్‌నగర్‌లోని అగ్నిమాపక సిబ్బంది 10 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఒక కంటైనర్ పూర్తిగా కాలిపోగా, మరో కంటైనర్ పాక్షికంగా దగ్ధమైంది.