06-02-2025 03:15:45 PM
ఎల్బీనగర్,(విజయక్రాంతి): ఎల్బీనగర్ లోని ఆటోనగర్ లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... ఆటోనగర్‌లోని ఒక గోదాం దగ్గరకు స్క్రాప్ తో ఉన్న రెండు కంటైనర్లు వచ్చాయి. కాగా, కంటైనర్లులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఓకే కంటైనర్ పూర్తిగా కాలిపోగా, మరో కంటైనర్ పాక్షికంగా కాలిపోయినట్లు కంటైనర్ యజమాని తెలిపారు. ఫైర్ సిబ్బంది పది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.