22-03-2025 07:43:02 PM
రూ.2లక్షల మేర ఆస్తినష్టం
అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేటలో శనివారం ఉదయం ఇంట్లో దీపారాధన అంటుకుని అగ్ని ప్రమాదం జరగ్గా సుమారు రూ.2లక్షల మేర నష్టం జరిగింది. బాది తుడు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పాత ఆంధ్రాబ్యాంక్ మార్గంలో కట్టా జోగారావు వీధిలో అరవ శ్రీను అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేసు కుంటూ జీవిస్తున్నాడు. ఇంట్లో ఉదయం దీపారాదన చేసిన శ్రీను కుటుంబ సభ్యులు కొంతసేపటి తరువాత సమీపంలోని బందువుల వద్దకు వెళ్లారు. దీపారాదన మంట ట్రేలకు అంటుకుని పక్కనే ఉన్న విద్యుత్ ప్లగ్ కు పాకింది. దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటల్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం: వలన రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాదితుడు శ్రీను తెలిపారు.