calender_icon.png 29 April, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

28-04-2025 09:20:44 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంటు(Yadadri Power Plant)లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దామచర్ల మండలం వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో మంటలు అంటుకున్నాయి. యూనిట్-1 బాయిలర్ లో ఆయిల్ లీకై  పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వచ్చేనెల యూనిట్-1 ప్రారంభానికి అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. యూనిట్-1 ట్రయల్ రన్(Unit-1 Trial Run) సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.