calender_icon.png 11 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అగ్నిప్రమాదం

10-07-2024 08:10:29 PM

హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీదత్తసాయి కాంప్లెక్స్ లో మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కాంప్లెక్స్ సమీపంలోని దుకాణాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కాంప్లెక్స్ లోని మూడో అంతస్తులోని షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు.