calender_icon.png 21 March, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఉపకేంద్రంలో అగ్ని ప్రమాదం

20-03-2025 08:17:03 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మర్దిపెట్ పరిధిపేట్ గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రంలో గురువారం మధ్యాహ్నం వేసవి ఎండవేడికి, కెపాసిటర్లు కాలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది మంటలను ఆర్పారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. కెపాసిటర్ల మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.