20-04-2025 12:30:10 AM
షార్ట్ సర్క్యూటే కారణం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): నగరంలోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమా దం జరిగింది. ఆ ఆస్పత్రి ఐదో అంతస్తులో శనివారం సాయంత్రం అకస్మా త్తుగా మంటలు చెలరేగి, పొగ అలుముకుం ది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే నిమ్స్‌కు చేరుకుని మం టలను ఆర్పివేశారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని నిమ్స్ ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్ తెలిపారు. ఈ ప్రమాదంలో రోగులకు, సహాయకులకు ఎవరికీ ఏ అపాయం కలుగలేదని, ఆస్పత్రిలో వైద్య సేవలకు ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎలాంటి నష్టం జరగలేదు: మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్‌లోని నిమ్స్ ఎమర్జె న్సీ బిల్డింగ్ ఐదో అంతస్తు ఆడిటో రియం వద్ద శనివారం షార్ట్ సర్క్యూట్ సంభవించి స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ప్రమా దంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టత నిచ్చారు. ప్రమాదంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభించలేదని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారని వెల్లడిం చారు. రోగులు, వారి బంధువులు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని భరోసానిచ్చారు.