లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది పిల్లలు మరణించారు. మరో 37 మంది శిశువులను సిబ్బంది కాపాడారు. గాయపడిన 16 మంది శనివారం ప్రాణాలతో పోరాడారు. మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో శుక్రవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) అవినాష్ కుమార్ విలేకరులకు తెలిపారు. శిశువుల మృతిపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.