03-04-2025 12:52:35 AM
సిద్దిపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): అర్థరాత్రి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించిన ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట పట్టణంలోని మారుతి నగర్ లో అర్థ రాత్రి ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణానికి చెందిన బెల్లంకొండ వెంక టేశ్వర రావు ఇంట్లో మొదటి అంతస్తులో నిద్రిస్తున్నారు.
రాత్రి 12గంటలకు షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి ఇంటిముందు పార్క్ చేసి ఉన్న ఒక్క కారు, మూడు బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. ఆలస్యంగా గమనించిన యజమాని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు రావడంతోనే ఈ ప్రమాదం వాటిల్లిందని ఇంటి యజమాని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగపోవడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.