21-02-2025 10:58:01 AM
ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
పటాన్ చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి పారిశ్రామికవాడ(Kazipally Industrial Estate)లోని హేటిరో ల్యాబ్స్ పరిశ్రమలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. డ్రయర్స్ వద్ద ఇంటర్మీడియట్ పౌడర్ లోడింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలడంతో అక్కడే పనిచేస్తున్న పరిశ్రమ ఉద్యోగి వెంకటరెడ్డి (49), బీహార్ కి చెందిన హెల్పర్ లు శైలేంద్ర ప్రసాద్(38), శేషు కుమార్(29)లు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమ యాజమాన్యం గాయపడిన వారిని వెంటనే సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి(Secunderabad Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలాన్ని ఐడీఏ బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.