calender_icon.png 24 February, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్సింగిలో అగ్ని ప్రమాదం

24-02-2025 04:51:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నార్సింగిలోని ఒక ఫర్నిచర్ గోదాములో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ గోదాములో పెద్ద ఎత్తున మంటులు చెలరేగాయి. మంటలు సమీపంలోని నివాసాలకు వ్యాపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణహాణి సంభవించలేదని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటు, మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలోని మైసమ్మగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించి లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.