21-04-2025 09:11:20 AM
కేవశ్ పురం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
కర్మాగారంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
14 అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కేశవ్ పురం(Keshav Puram) ప్రాంతంలోని ఒక కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. ఆ కర్మాగారం లారెన్స్ రోడ్డులో ఉంది. స్థానికుల సమాచారం అందిన తర్వాత 14 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సీనియర్ అధికారులు కూడా మంటలు చెలరేగిన ప్రదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. వీడియోలో, నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం కనిపించింది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.