calender_icon.png 5 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

04-04-2025 08:33:40 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలం( AP Secretariat)లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని రెండో బ్లాక్ లో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిప్రయాదంపై ఫైర్ సెఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ సిబ్బంది(Fire safety personnel) హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణతో సహా అనేక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం జరగలేదు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది సాదారణ అగ్నిప్రమాదామా? లేకా ఏమైనా కుట్ర పన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.