calender_icon.png 4 March, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌ వద్ద అగ్నిప్రమాదం

04-03-2025 11:57:02 AM

హైదరాబాద్: నగరంలోని అంబర్ పేట్ ఫ్లైఓవర్( Amberpet flyover) సమీపంలోని అగ్నిప్రమాదం సంభవించింది. చే నంబర్‌ చౌరస్తా దగ్గర ఉన్న ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో మంగళవారం ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాదం(Fire accident)తో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై రాకపోకలు మహాశివరాత్రి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.