న్యూఢిల్లీ : వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్యర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పూజా ఖేడ్యర్ పై ఫోర్జరీ, మోసం, ఐటీ, దివ్యాంగ చట్టాల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్పీ ఫిర్యాదు ఆధారంగా తప్పుడు గుర్తింపు పత్రాలతో పరిమితికి మించి పరీక్షలు రాయడంపై సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2022 నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి, డిబార్ చేసినట్లు షోకాజ్ నోటీసును అందజేశామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పూజా భవిష్యత్తు పరీక్షలు రాకుండా డిబార్ చేశామని పేర్కొంది.