calender_icon.png 5 February, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్

05-02-2025 10:40:14 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ముఖ్యమంత్రి అతిషి(Delhi Chief Minister Atishi)పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్(First information report) నమోదైంది. ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం, అతిషి 10 వాహనాల కాన్వాయ్, 50 నుండి 70 మంది మద్దతుదారుల బృందంతో ఫతే సింగ్ మార్గ్‌లో కనిపించారు.

ఎన్నికల గైడ్‌లైన్స్‌కు లోబడి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని తాము ఆదేశించామని, అయితే ఆమె తమ విధులను నిర్వహించకుండా అడ్డుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌పై అతిషి తన ఎక్స్ లో స్పందించారు. భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) అభ్యర్థి రమేష్ బిధురి, అతని కుటుంబం బహిరంగంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తమపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కమిషన్‌ చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ(Delhi Assembly election 2025 ) నియోజకవర్గాలు ఉండగా, బుధవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది.