calender_icon.png 18 January, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతంతో ముగింపు

06-08-2024 02:16:22 AM

పారిస్: అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ పారిస్ ఒలింపిక్స్‌లో తన జర్నీని ముగించింది. ఇప్పటికే మూడు స్వర్ణాలు కొల్లగొట్టిన బైల్స్ సోమవారం ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ పోటీల్లో రజతం గెలుచుకుంది. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో బైల్స్ సాధించిన పతకాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఈవెంట్‌లో బైల్స్‌కు స్వర్ణం రాకపోవడం ఇదే మొదటిసారి. కాగా బ్రెజిల్‌కు చెందిన రెబెకా పసిడి కైవసం చేసుకుంది. ఇక బ్యాలెన్స్ బీమ్ ఫైనల్స్‌లో పట్టు కోల్పోయిన బైల్స్ పతకం గెలవడంలో విఫలమైంది. పారిస్‌తో కలుపుకుని బైల్స్ ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో సాధించిన పతకాల సంఖ్య 11కు చేరుకుంది.