calender_icon.png 3 April, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరితగతిన పూర్తి చేయండి

28-03-2025 01:06:14 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర 

మహబూబ్ నగర్ మార్చి 27 (విజయ క్రాంతి) :  ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్ లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని  డిఆర్డీఓ ను  జిల్లా కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. 

గురువారం రాష్ట్ర అధికారుల విసి అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు  2022-23 సంవత్సరానికి సంబంధించిన కమీషన్ పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్ ఉన్న వివరాలు అందచేయాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. 

గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉందని త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్డిఓ నర్సింహులు,ఎల్.డి.ఎం.భాస్కర్,అదనపు డి.అర్.డి. ఓ జోజప్ప, సి.ఎం. ఓ బాలు నాయక్,తదితరులు పాల్గొన్నారు.