- సీఎంఆర్ కాలేజీ ఘటనపై కొనసాగుతున్న పోలీసుల విచారణ
- రెండు రోజులు సెలవులు ప్రకటించిన యాజమాన్యం
- కేసును సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
మేడ్చల్, జనవరి 3 (విజయక్రాంతి): సీఎంఆర్ కాలేజీ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాలేజీ సిబ్బంది కొందరు లేడీస్ హాస్టల్ బాత్‌రూంలో వీడియోలు తీశారని ఆరోపిస్తూ రెండురో విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాలేజీకి చెందిన ఐదుగురు సిబ్బందిపై అనుమానం ఉందని విద్యార్థ్థినులు చెప్పగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడతున్నారు.
అలాగే హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని కూడా విచారించారు. బాత్‌రూం వెంటిలేటర్‌పై చేతి ముద్రలను సేకరించారు. ఇవి ఇద్దరి వేలిముద్రలుగా తేలింది. ఈ వేలిముద్రలు ఐదుగురు అనుమానితుల వేలి ఖిసూద్రలు కావని ప్రాథమికంగా తేలినట్లు తెలిసింది. అయినప్పటికీ ఐదుగురి వేలి ముద్రలు, వెంటిలేటర్ మీద ఉన్న వేలిముద్రలు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
ఫోరెన్సిక్ నివేదికలో ఏమి వస్తుంది, డిలీటెడ్ వీడియోల ట్రేస్‌లో ఏమితేలుతుందనే విషయం ఆసక్తిగా మారింది. సీఎంఆర్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యంది. కేసును సుమోటోగా స్వీకరించడమే గాక మ కమిషన్ కార్యదర్శి పద్మజ రమణిని కాలేజీకి పంపింది. ఘటనపై తమకు నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌ను మహిళా కమిషన్ ఆదేశించినట్లు సమాచారం.
రెండు రోజులు సెలవు ప్రకటించిన యాజమాన్యం
కాలేజీలో విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో సీఎంఆర్ కళాశాలకు యాజ రెండు రోజులు సెలవు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటిం ఆదివారంతో కలిపి మూడు రోజులు సెలవు రావడంతో విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఆందోళన జరుగుతుండటంతో చాలామంది తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని తమ పిల్లల్ని తీసుకెళ్లారు.