calender_icon.png 1 April, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామయంపేటకు చేరిన సన్న బియ్యం..

29-03-2025 08:33:59 PM

రామాయంపేట (విజయక్రాంతి): సన్న బియ్యం రేషన్ షాపుల్లో ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా రామయంపేట మండలానికి సంబంధించి సన్న బియ్యం గోదాములకు రావడం జరిగింది. రామాయంపేట, నిజాంపేట, చిన్న శంకరంపేట మండలాల్లో 68 రేషన్ దుకాణాలు ఉండగా 6500 క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు.