calender_icon.png 3 April, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యంతో పేదవారికి ప్రతిరోజు పండగే

02-04-2025 12:55:15 PM

జుక్కల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అటాహసంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ తో పేదవారికి ప్రతిరోజు పండగే అని కాంగ్రెస్ యూత్ గ్రామ అధ్యక్షుడు సురేష్ అన్నారు. బుధవారం బస్వాపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. సన్న బియ్యం పంపిణీతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఆలోచించి ప్రతి రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేయడం హర్షిణీయమన్నారు.

సన్న బియ్యం పంపిణీతో ప్రభుత్వానికి లోటు ఏర్పడ్డ గాని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. పేద ప్రజలు పండగ పూట సన్నబియ్యాన్ని కిరణ కొట్టులోంచి కొనుక్కోవలసిన అవసరం లేదని ప్రస్తుతం ప్రతిరోజు సన్న బియ్యం తో వండుకొని తినొచ్చని అన్నారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు బస్వంత్, సంగ్రామ్, మల్గొండ, ఇస్మాయిల్, పాషా, సురేష్, మారుతిలు పాల్గొన్నారు.