calender_icon.png 19 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అద్భుతం

16-04-2025 12:34:12 AM

గుజరాత్ పౌర సరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ చంద్ర

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అద్భుతమని గుజరాత్ రాష్ర్ట పౌర సరఫ రాల శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ చంద్ర మీనా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలను అధ్యయనం చేసేందుకు ఆయన మంగళ వారం తెలంగాణకు వచ్చారు.

పంజాగుట్ట, ఏ.జి కాలనీల్లో జనపోషణ కేంద్రాలను రాష్ర్ట పౌర సరఫ రాలశాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహన్‌తో కలసి సందర్శించారు. రమేష్‌చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ సంస్కరణలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రవేశ పెట్టిన ఈశూఘ-పాస్ సిస్టం ప్రజా పంపిణీలోని లోపాలను సరిదిద్దుతుందన్నారు.