04-04-2025 07:22:30 PM
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని నిరుపేదల ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు అందరికీ సన్నబియ్యం అందించడం జరుగుతుందని మండల తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ రాజేశ్వర్ లు ఆన్నారు. మండలంలోని పాన్నారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం అందించే లక్ష్యంతో ప్రారంభించిన సన్న బియ్యంను మండలం లోని లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
నిరుపేదల ఆకలి తీర్చేందుకు అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు ల ఆద్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కడారి జీవన్ కుమార్, గందే రామచందర్, కొమురయ్య, ఆకుల అంజి, గ్రామ నాయకులు బీర సమ్మయ్య, నీలం ఆనంద్, గోషిక వినయ్, నీలం రవి, పెంచాల అనిల్, కుంటాల పోచయ్యలు పాల్గొన్నారు.