04-04-2025 11:19:41 PM
సిర్పూర్: సన్న బియ్యం పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ అన్నారు. మండలంలోని మహాగావ్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిందని దీనికి అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఉదయ్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్, బిజెపి మండల అధ్యక్షుడు శంభు, రాయి సెంటర్ సర్ మేడి ఆత్రం ఆనంద్ రావు, గ్రామ పటేల్ శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.