calender_icon.png 6 April, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

05-04-2025 09:17:00 PM

కొల్చారం,(విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయ మనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్న గారి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డిలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ శ్రీకారం చుట్టిందని అన్నారు. శనివారం నాడు మండల కేంద్రమైన కొల్చారంలో కొబ్బరికాయ కొట్టి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు బొజ్జ వెంకటరమణ, రాజలింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశన్న గారి శ్రీశైలం, చింతల బాలరాజ్, అక్రమ్, తదితరులు పాల్గొన్నారు.