calender_icon.png 6 April, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల శ్రేయస్సు ప్రజా పాలన లక్ష్యం

05-04-2025 09:54:40 PM

మండల పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్

కొల్చారం,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా నిబద్ధతగ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేస్తారని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో సన్న బియ్యం ప్రజా పంపిణీ పథకంలో భాగంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవా డు శ్రీమంతుడు వలె సన్నబియ్యం తిని వాళ్ళు ఆనందంగా గడపాలన కృత నిశ్చయంతో ప్రవేశపెట్టి పథకాన్ని ఈరోజు ప్రారంభించడం మాకెంతో సంతోషంకర విషయమని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ప్రతి పేదవాడు ఆకలి లేకుండా చూడడమే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్న మా ప్రజాపాలన నడిపిస్తున్న రేవంత్ రెడ్డి  అలాగే సహచర మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సంబంధిత శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి  జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండా సురేఖ  జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ   నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్  ఆవుల రాజిరెడ్డి  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని  తెలిపారు.