calender_icon.png 3 December, 2024 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న ధాన్యం మిల్లర్ల పాలు

14-11-2024 12:55:13 AM

  1. కల్లాల వద్దే కొనుగోలు చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు 
  2. కేంద్రాలకు రాకుండా రైతులను మభ్యపెడుతున్న దళారులు
  3. సమయం కలిసొస్తుందని భావిస్తున్న అన్నదాతలు
  4. భారీ నిల్వల కోసం మిల్లర్ల ప్లాన్!
  5. ప్రభుత్వం లక్ష్యం కష్టమేనంటున్న అధికారులు

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) :  సన్నధాన్యం సేకరణ కోసం ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ ప్రైవేట్ వ్యాపా రులు ఈ ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లకుండా మభ్యపెడుతూ కల్లాల వద్దనే కొనుగోలు చేస్తున్నారు.

మధ్య దళారుల సహాయంతో తేమ శాతం తక్కువగా ఉన్నా, తాలు, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సొంత వాహనాల్లో ప్రభు త్వం నిర్ణయించిన ధర కంటే రూ.100 తక్కువకు తీసుకుని రైతులకు వెంటనే నగదు చెల్లి స్తున్నారు.

ధాన్యం అమ్మిన వెంటనే డబ్బు లు వస్తుండడంతో చాలామంది రైతులు వ్యాపారుల వైపే మొగ్గు చూపడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు బోసిపోతున్నా యి. ప్రైవేట్ వ్యాపారులు సన్నబి య్యం కొనుగోలు చేస్తున్న విష యం తెలిసినా పౌరసరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ధాన్యం నిల్వలకు విశ్వప్రయత్నాలు..

జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్రంలో పండి ంచిన సన్నబియ్యాన్ని సైతం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో సన్నరకం ధాన్యానికి డిమాండ్ ఉంటుందని భావించి ఇప్పటి నుంచే రైతుల నుంచి కొనుగోలు చేసి భారీగా నిల్వ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇప్పటికే పలు ప్రైవేట్ గోదాంలను అద్దె తీసుకున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మిల్లర్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకోవడంతో ధాన్యం నిల్వ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు..

లక్ష్యం ౯౫లక్షల మెట్రిక్ టన్నులు..

ఈసీజన్‌లో 150లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే  అవకాశముందని ప్రభు త్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ముందుగా 95లక్షల మెట్రిక్ టన్ను లు కొనుగోలు చేసేందుకు 7,132 కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. రూ.20వేల కోట్లు కేటాయించి త్వరగా ధాన్యం సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

అయితే 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ఇలా అయితే ప్రభుత్వం ఇచ్చి లక్ష్యం నెరవేరడం కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సన్నవడ్లకు బోనస్ విషయంలో కేంద్రాల నిర్వాహకులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు రావడంలేదు.

వాతా వరణ మార్పుల కారణంగా ధాన్యంలో తేమ 21శాతం వరకు ఉంటోంది. దీంతో ఐదారు రోజులు ఆరబెట్టిన తరువాతే నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. దీంతో మిగిలిన రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకరా వడంలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 

నిబంధనలు సడలించాలి

తేమ శాతాన్ని 17 నుంచి 20కి పెం చాలని, పొలం నుంచి తీసుకొచ్చే ధాన్యానికి అయ్యే రవాణా ఖర్చును కూడా ప్రభుత్వమే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల పేరుతో తాలు, తరుగు, గింజ గుర్తింపు సాకుతో రోజుల తరబడి కేంద్రాల్లో ధాన్యాన్ని ఉంచకుండా వెంటనే తూకం వేయాలని కోరుతున్నారు. పంట పం డించినప్పుడు పడే కష్టం కంటే అమ్మే సమ యంలోనే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.