calender_icon.png 17 October, 2024 | 11:51 AM

జాన్సన్ అండ్ జాన్సన్‌కు జరిమానా

17-10-2024 01:03:11 AM

126 కోట్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశం

వాషింగ్టన్, అక్టోబర్ 16: కంపెనీకి చెందిన బేబీ టాల్కమ్ పౌడర్‌ను వాడడంతోనే క్యాన్సర్ వచ్చిందన్న కారణాలతో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు అమెరికాలోని ఓ కోర్టు భారీ జరిమానా విధించింది. పిటిషనర్ లేదా బాధితుడికి దాదాపు 15 మిలియన్ డాలర్లు అంటే రూ. 126 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

తనకు క్యాన్సర్ రావడానికి కారణమైన జాన్సన్ కంపెనీకి వ్యతిరేకంగా అమెరికాకు చెందిన ప్లాట్‌కిన్ ఇవాన్ అనే వ్యక్తి  కనెక్టికట్ కోర్టులో పిటిషన్ వేశారు. జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ టాల్కమ్ పౌడర్‌ను తాను కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నానని, 2021లో తాను చేయించుకున్న ఆరోగ్య పరీక్షల్లో తనకు మెసోథెలియోమాన్ అనే క్యాన్సర్ వచ్చినట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కంపెనీకి భారీ జరిమానా విధించింది.

బాధితుడికి రూ. 126 కోట్లు చెల్లించాలని ఆదేశిం చింది. అయితే కేసు వాస్తవాలను వినకుండా జడ్జి తీర్పు ఇచ్చారని కంపెనీ ప్రతి నిధి అన్నారు.  కాగా బేబీ టాల్కమ్ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్ అవశేషాలు ఉన్నాయని గతంలో పలువురు ఆరోపించారు. ఈక్రమంలో బాధితులకు అనుకూలంగా కోర్టు లు తీర్పు ఇవ్వడంతో 22 మంది మహిళలకు 200 కోట్ల డాలర్లను పరిహారంగా కంపెనీ చెల్లించింది.