calender_icon.png 25 November, 2024 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ వర్సిటీ ప్రాంగణంలో ఫైన్‌ఆర్ట్స్ వర్సిటీ!

26-09-2024 03:45:47 AM

ఆలోచనను విరమించుకోవాలంటున్న వర్సిటీ ఉద్యోగులు

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లోని అం బేద్కర్ ఓపెన్ వర్సిటీకి చెందిన పదెకరాల స్థలాన్ని మాసబ్ ట్యాంక్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి కేటా యించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం రెండు వర్సిటీలకు ఈనెల 19న లేఖ రాశా రు.

తాజాగా ఈ లేఖ బయటికి రావడంతో అంబేద్కర్ వర్సిటీ ఉద్యోగుల జేఏసీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వర్సిటీలో బుధవారం పెద్దఎత్తున ఉద్యోగులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ వర్సిటీకి ఉన్న 53 ఎకరాల్లో, టీరు శాట్‌కు దాదాపు ఐదెకరాలను గత ప్రభుత్వం అనధికారి కంగా కట్టబెట్టిందని ఉద్యోగులు చెప్తున్నారు.

కేబుల్ బ్రిడ్జి అభివృద్ధికి నాలుగెకరాలు ఇప్పటికే ఉపయోగించారని, దుర్గం చెరువులో మరో ౫ ఎకరాలకుపైగా నీట మునిగిందన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు సేవలందించడానికి నిర్మించిన వివిధ కార్యాలయ భవనాలతో ప్రస్తుతం వర్సిటీ 35 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. ప్రత్యేక భవనాలను నిర్మించాల్సిందిపోయి, వర్సి టీ భూములను మరో వర్సిటీకి కేటాయించడం సరైంది కాదన్నారు.

వర్సిటీ స్థలాలను ఇతర విద్యాసంస్థలకు కేటాయిస్తే భవిష్యత్తులో తమ వర్సిటీ అభివృద్ధి, విస్తరణకు అవకాశం ఉండదని, ఈక్రమంలోనే ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమానికి సిద్ధ మవుతామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.