calender_icon.png 19 April, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం నుంచి ఆర్ధిక తోడ్పాటు హర్షణీయం

19-04-2025 12:49:05 AM

ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి

కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు

256 మందికి లబ్దిదారులకు రూ.1.56కోట్ల విలువేంచేసే చెక్కులు అందించిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 18 (విజయక్రాంతి): అత్యవసర పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యంచేయించుకొని ఆర్ధికంగా నష్టపోయిన పేదలకు అదేవిదంగా, ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి ఆర్ధికంగా చితికిపోయిన పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నేరుగా ఆర్ధిక సాయం అందించడం హర్షణీయమని, పేద కుటుంబాలకు ఈ పథకాలు భరోసా కల్పిస్తున్నాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. 

కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని 170 మంది లబ్దిదారులకు చీఫ్ మినిష్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 69.50లక్షల విలువ చేసే చుక్కులను,  86 మంది కల్యాణ లక్ష్మి-షాదిముబారక్ పథకంలో మంజూరైన రూ.86.86లక్షల విలువైన చెక్కులను శుక్రవారం కొత్తగూడెం క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ సిఎంఆర్‌ఎఫ్ పథకం మంజూరు మరింత వేగవంతం చేయాలనీ, రూ.60వేల సీలింగ్ విధానాన్ని రద్దు చేసి పూర్తి ఖర్చులను లబ్దిదారులకు అందించాలన్నారు.

ఆడబిడ్డలకు వివాహం చేసి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న పేదకుటుంబాలని కల్యాణ లక్ష్మి-షాదిముబారక్ పథకం ఆసరాగా నిలుస్తోందని, ఈ పథకం అమలులో సాంకేతిక లోపాలను సరిచేసి ధరఖాస్తుదారులందరికి అందించాలని, ఎన్నికల హామీని పూర్తి స్థాయిలో అమలు చేసి తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ప్రభుత్వానికి సూచించారు.  ప్రభుత్వం నుంచి అర్ధక సాయం పొందిన లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ కె ఆర్ కె వి ప్రసాద్, కొత్తగూడెం డిప్యూటీ తహసీల్దార్ అంజద్, మున్సిపల్ కమిషనర్ సుజాత, పిఏ సురేష్, నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, వంగ వెంకట్, జి.వీరస్వామి, మునిగడప వెంకటేశ్వర్లు, జక్కుల రాములు, ఎస్ కె ఫహీమ్, మాజీ కౌన్సిలర్లు ధర్మరాజు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, మునిగడప పద్మ, రమణమూర్తి, లగడపాటి రమేష్, మిర్యాల రాము, రాంబాబు, ఖయూమ్, శ్రావణ్, అంకుస్ తదితరులు పాల్గొన్నారు.