22-04-2025 02:06:52 AM
డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 21: పాలసీలతో కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగు తుందని డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఉప్పల్ లో నిర్వహించిన టాటా లైఫ్ ఇన్సూ రెన్స్ సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... టాటా లైఫ్ పాలసీలతో కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుందన్నారు.
టాటా లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తూ కొన్ని కుటుంబాలను, కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక భరోసా కల్సిస్తూ, సింగపూర్ క్వాలిఫై అయిన గ్యార మల్లేష్ సీనియర్ లైఫ్ ప్లానర్‌ను డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్‌కుమార్ చేతుల మీదగా ఘనంగా సన్మానించారు. అనంతరం గ్యార మల్లేష్ మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరూ పాలసీలు తీసుకుని తమ కుటుంబాలకు కొన్ని కోట్ల రూపాయలు తను చనిపోతేనే కాదు బ్రతికి ఉన్నప్పుడే భరోసా కల్పించాలని కోరారు.
ఈ అవకాశం ఒక టాటా ఇన్సూరెన్స్‌లో సాధ్యమవుతుందన్నారు. నాకు టాటా లైఫ్ ఇన్సూరెన్స్‌లో అవకాశం కల్పించిన డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు, కందికంటి విజయకుమార్‌కు అదేవిధంగా టాటా టీమ్ మెంబర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి రాజు, వంగూరి బాల్‌రాజ్, ప్రవీణ్, అరుణ్ కుమార్, పిట్టల వీరేశ్, కొండ్రు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.