calender_icon.png 1 April, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక భద్రత కల్పించడం కోసమే సంక్షేమ పథకాలు

29-03-2025 04:01:45 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అన్ని వర్గాల ప్రజల ఆర్థిక భద్రత పెంపొందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అనేక సంక్షేమ పథకాలను(Welfare Schemes) ప్రవేశపెడుతోందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Kuchakulla Rajesh Reddy) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట, బిజ్నిపల్లి, తాడూరు మండలాల సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వివిధ గ్రామాలకు సంబందించిన 133 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు.