calender_icon.png 25 February, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక అక్షరాస్యత.. మహిళా సాధికారత

25-02-2025 05:31:24 PM

గోడపత్రాల ఆవిష్కరణ..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు "ఆర్థిక అక్షరాస్యత-మహిళా సాధికారత" పై ఫిబ్రవరి 24 నుండి 28వ తేది వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించబడిన గోడ పత్రికలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఆర్థిక అక్షరాస్యత సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని ముఖ్యంగా మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన కలిగి ఉండడం ద్వారా త్వరితగతిన ఆర్థిక ప్రగతి సాధించవచ్చన్నారు.

మహిళల కొరకు ఆర్థిక ప్రణాళిక, పొదుపు, నష్ట నివారణ చర్యలు, ఆర్థిక పరిపుష్టికి రుణాలు పొందడం తదితర అంశాలపై గృహిణులు, ఉద్యోగినులు, స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు, కళాశాల విద్యార్థినులకు అన్ని బ్యాంక్ శాఖలు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు బ్యాంక్ అధికారులు విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామిరెడ్డి, IDOC మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.