తెరపైకి టీఎంసీ ఎమ్మెల్యే పేరు!
కోల్‌కతా, సెప్టెంబర్ 17: కోల్‌కతా లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిట ల్‌లో జరిగిన ఆర్థిక అవకతవకల నేప థ్యంలో ఇప్పటికే ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగియగా, తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీఎంసీ నేతపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇతడిపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఏకకాలంలో ఆరుచోట్ల దాడులు నిర్వహి ంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీస ర్లు వెస్ట్‌బెంగాల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్త రాయ్‌కు చెందిన నర్సింగ్ హోంలోనూ తనిఖీలు చేపట్టారు.
కాగా తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ కేసుల్లో తమ పార్టీ నాయకులను ఇరకాటంలో పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్‌ఘోష్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ముందుగా వీటిని కోల్‌కతా పోలీసుల ప్రత్యేక బృందం (సిట్) దర్యాప్తు చేయగా, ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి కేసు లు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపల్ సందీప్‌తో పాటు తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీస్ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సందీప్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, అతడి నివాసాలు, అతడితో సంబంధమున్న వారి నివాసాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.