calender_icon.png 23 December, 2024 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం

08-10-2024 01:08:10 AM

బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలించే కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, తాజాగా తెలంగాణ కూడా అదే దారిలో నడుస్తోందని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసిందన్నారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిందని, నిర్మించిన ఇండ్లు అమ్ముడుపోవడం లేదని వాపోయారు. గ్రామ పం చాయతీ కార్మికులకు తొమ్మిదినెలలుగా వేతనాలు లేక పారిశుద్ధ్యం పడకేసిందన్నారు.