calender_icon.png 11 January, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాలో ఆర్థిక సంక్షోభం

31-12-2024 02:49:17 AM

  • అప్పుల ఊబిలో జీహెచ్‌ఎంసీ
  • ఇప్పటివరకు రూ.6,233 కోట్ల మేర అప్పు 
  • వాటిని తీర్చేందుకే మరో 40 ఏళ్లు!
  • కొత్త పనులకు నిధులు శూన్యం 
  • ప్రతినెలా వేతనాలకు తప్పని ఇబ్బందులు

  • హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మును  లేనివిధంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

  • పాలనాపరమైన వ్యవహారాలలో పారదర్శకతను చాటుకోవడంలో వైఫ్యలాలు చెందడంతో పాటు అధి  అవినీతి ఆరోపణలు సైతం బల్దియాను 2024లో అంతే స్థాయిలో కుదిపే  వీటన్నింటికీ మించి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ పరిణామాలు బల్దియాపై కూడా తీవ్రస్థాయిలోనే ప్రభావం చూపాయ  చెప్పవచ్చు.

  • ఏకంగా మేయర్, డిప్యూటీ మేయర్‌లు పార్టీ పిరాయింపులకు పాల్పడటంతో 2025 వార్షిక ముసాయిదా బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీలో ఆమోదం చేయించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. బల్దియాకు ఉన్న అప్పులు తీర్చేందుకు అసలుతో పాటు ప్రతినెలా రూ.100 కోట్లకుపైగా చెల్లించాల్సి రావడంతో ప్రతినెలా ఒకటో తేదీన వేతనాల కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

  • అయితే బల్దియా నెత్తిపై ఇప్పటివరకు రూ.6,223 కోట్ల అప్పు ఉండటంతో వాటిని చెల్లించేందుకు మరో 40 ఏళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.

బడ్జెట్‌పై ఫిరాయింపుల ప్రభావం..

2020 డిసెంబర్‌లో జరిగిన బల్దియా ఎన్నికల బలాబలాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గద్వాల విజయలక్ష్మీ, మోతె శ్రీలతా శోభన్ రెడ్డి మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా ఎన్నికయ్యారు. తదనంతర రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మూడేళ్ల పాటు మేయర్, డిప్యూటీ మేయర్‌లు సొంత పార్టీలోనే కొనసాగారు.

అయితే 2023 డిసెంబర్‌లో ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకోవడంతో కారణాలు ఏమైనా గ్రేటర్ సారథులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. మూడేళ్లు నామమాత్రానికే పరిమితమైన మేయర్, డిప్యూటీ మేయర్లు ఫిరాయింపుల అనంతరం బల్దియాలో మేమూ ఉన్నామంటూ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చర్చ జోరుగా సాగుతోంది.

అందులో భాగంగానే మేయర్, డిప్యూటీ మేయర్‌లు పలుమార్లు ఉద్యోగుల అటెండెన్స్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. జూలై  జరిగిన కౌన్సిల్ సమావేశంతో పాటు ఇటీవల 2025 ప్రతిపాదిత బడ్జెట్ ఆమోదానికి పాలకవర్గం నానా తిప్పలు పడాల్సి వచ్చింది. అయితే, నాలుగేళ్ల పదవీకాలం తర్వాత మేయర్‌పై అవిశ్వాసానికి అవకాశం ఉన్న నేపథ్యంలో 2025లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

అస్తిత్వం కోల్పోతున్న బల్దియా..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క్రమేపీ అస్తిత్వం కోల్పోతుందనే అను భుషూలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది రూ. 8,440 కోట్ల బడ్జెట్‌ను రూపొందించినప్పటికీ అభివృద్ధ్దికి సరిపడా నిధు  సమకూర్చుకోవడంలో పాలకవర్గం వైఫ  కొట్టొచ్చినట్టుగానే స్పష్టమ   2015 మధ్యకాలంలో వివి  ప్రాజెక్టుల కోసం తీసుకున్న అప్పులు రూ. 6,553 కోట్లు అయితే.. రీపేమెంట్ మొదలైన 2022 ఏడాది చివరి నుంచి ఇప్పటివరకూ చెల్లించింది కేవలం రూ.330 కోట్లు మాత్రమే.

బల్దియాకు ఇంకా రూ.6223 కోట్ల అప్పు మిగిలి ఉంది. ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రకారం లెక్కిస్తే ఈ మొత్తం తీరాలంటే మరో 40 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటు పాలకవర్గం, అటు అధికారులు బల్దియాకు వచ్చే ఆదాయ వనరులపై దృష్టి సారించడం వదిలేసి.. ఆదాయం రూపంలో వచ్చే రాబడులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా విమర్శలు ఉన్నాయి.

దీనికి తోడుగా అధికారులు అవినీతికి ఇచ్చేంత ప్రాధాన్యత.. విధుల్లో పారదర్శకత చూపించడంలో చూపడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎంటమాలజీ, హెల్త్, శానిటేషన్, అడ్వర్టుజ్‌మెంట్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, అడ్మిన్ తదితర విభాగాలలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.

ఇప్పటికే ప్రకటించి, 2025లో ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై పాలకవర్గం మల్లగుల్లాలు పడుతోంది. నిధుల కోసం ప్రభుత్వంపై పెట్టుకుంటున్న ఆశలు నెరవేరుతాయా అనే సందేహాలూ ఉన్నాయి.

దీనికి తోడు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.1500 కోట్ల బకాయిల అంశం బల్దియాకు కొరకరాని కొయ్యగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో బల్దియా క్రమేపీ తన అస్తిత్వాన్ని కోల్పోతుందనే విమర్శలు లేకపోలేదు. పాలకవర్గానికి ఆఖరి ఏడాదిగా మిగిలిన 2025లో అయినా.. బల్దియా కష్టాలు గట్టెక్కుతాయా.. లేదా చూడాలి.