కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవటం అందరినీ కలిచివేస్తోంది. కొండచరియలు విరిగిపడి తీవ్ర ధన, ప్రాణ నష్టంతో విలవిల్లాడుతున్న బాధితుల సహాయక చర్యల కోసం పలువురు సినీ నటులు ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా చిరంజీవి, రామ్‌చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సామాజిక మాధ్యమాల వేదికగా సానుభూతి తెలిపారు. ‘వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది. బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని చిరంజీవి పోస్ట్‌లో రాశారు. మరో స్టార్ నటుడు అల్లు అర్జున్ సైతం కేరళ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.