09-03-2025 03:49:02 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో దండేపల్లి మండల వాసి తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర పెరిక కుల సేవా సమితి అధ్యక్షులు మద్దె లింగన్న, సెక్రటరీ వలిశెట్టి లక్ష్మీ శేఖర్, సమితి సభ్యులు డోంగరి శంకర్, మాజీ జెడ్పి చైర్మన్ చుంచు ఉషన్న, బొడ్డు శంకర్ లు ఆదివారం హైదరాబాద్ లోని వెల్నెస్ హాస్పిటల్ కి వెళ్లి ప్రమాదంలో గాయపడి వైద్యం పొందుతున్న మేడిశెట్టి రాజలింగు భార్య సుజాతను పరామర్శించారు. అనంతరం రాష్ట్ర పెరిక కుల సేవా సమితి సభ్యులు 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సుజాత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.