మంథని, డిసెంబర్ 23 (విజయ క్రాంతి): రామగిరి మండలంలోని ఆదివారం పేట ఎస్సీ కాలనీలోని కన్నూరి బాణయ్య అనారోగ్యంతో డయాలసిస్త బాధపడుతుండగ వారిని వారి కుటుంబాన్ని ముత్తారం మాజీ జడ్పీటీసి భారతి-వరప్రసాద్ పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ గ్రా మ అధ్యక్షులు మైదం బుచ్చయ్య, మాజీ ఉపసర్పం అట్టేతిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి, కుర్రే కొమురయ్య, రామగిరి మండలం యూత్ ఉపాధ్యక్షులు గోడిశేల సంతోష్, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నూరి శ్రీకాంత్, నాయకు లు కన్నూరి కిరణ్, వంశీ పాల్గొన్నారు.