22-04-2025 12:00:00 AM
సూర్యాపేట, ఏప్రిల్ 21: ఆత్మకూరు మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల శెట్టిగూడెంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పల్లా సుదర్శన్ రెడ్డి గత ఫిబ్రవరి నెలలో అనారోగ్య కారణం చేత మృతి చెందడంతో తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూ. లక్ష 31 వేల 700 ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు సుకన్య సమృద్ధి యోజనలో పల్లా నిర్వణ రెడ్డి ఖాతాలో జమా చేసి ఆ పాస్ బుక్ ను సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఆయన భార్య సునీతల, కూతురు, కుమారుడికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నూరు నాగన్న, జిల్లా అధ్యక్షులు నేరెళ్ల దేవరాజు, జిల్లా నాయకులు అమరబోయిన రామకృష్ణ, రావులకొళ్ళు సుధాకర్, మెంతబోయిన సైదులు, లింగారెడ్డి పాల్గొన్నారు.