calender_icon.png 20 March, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం

20-03-2025 12:52:31 AM

మహబూబ్ నగర్ మార్చి 19 (విజయ క్రాంతి) : పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసి కాలేజీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న  నందిని అనే విద్యార్థిని కామెర్లు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ మృతి చెందింది.ఈ విషయం తెలు సుకున్న పీ యూ అధికారులు  ఆమె కుటుం బ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబ సభ్యులకు  25,000 లను  ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా వీసీ జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ నందిని కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని అన్నారు. వీసీ తో పాటు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికాంత్ , వీసీపీఏ సూర్య నాయక్  తదితరులు ఉన్నారు.