ఖమ్మం (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ సాయం చేస్తూ ఎందరికో బాసటగా నిలుస్తున్న జాంబవవారసులం గ్రూపు ప్రమాదవశాత్తు మరణించిన సోమయ్య కుటుంబానికి శనివారం జాంబవ వారసులం గ్రూపు సభ్యులు తమ గ్రూపు సభ్యులు ద్వారా సేకరించిన 75 వేల రూపాయలను అందజేశారు. వివరాల్లో కెళితే... ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన కొలికపోగు సోమయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించటం జరిగింది. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. సోమయ్య జాంబవవారసులం గ్రూపులో సభ్యుడుగా ఉండటంతో ఆ గ్రూపులోని సభ్యులు అందరూ కలిసి తలా కొంత జమచేయగా వచ్చిన 75,000 రూపాయలను కల్లూరు లోని యూనియన్ బ్యాంక్ లో సోమయ్య కూతురు కొలికపోగు శ్రీతపస్వి పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేయటం జరిగింది.
అట్టి బాండ్ పేపర్ ను శనివారం ఖమ్మంలోని సంఘ కార్యాలయంలో తహశీల్దార్ కోట రవికుమార్ చేతులమీదుగా సోమయ్య కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమయ్య కుటుంబ సభ్యులతో పాటు బొజ్జ గంగన్న, పేరెల్లి శ్రీను, కిన్నెర వెంకటేశ్వర్లు, తోటపల్లి జీవన్, కంచర్ల కర్నాకర్, కనకం సైదులు, మరికంటి కన్నారావు, కేదాస్ కృష్ణ, పెనుగూరి కోటేశ్వరరావు, ఆరెంపుల అంబేద్కర్, నెమలి కిషోర్, గురిజాల నరేష్, దాసరి చంద్రశేఖర్, తోళ్ల శ్రీను, పరిమల రాము, కోట జగదీష్, కాంపాటి ప్రభుదాస్, బాలమర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.