రామగిరి (విజయక్రాంతి): రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన చంద్రశేఖర నరేందర్ అనారోగ్యంతో మృతి చెందగా వెంటనే స్పందించిన మాజీ జెడ్పిటిసి గంట వెంకట రమణారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి, దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. అనంతరం స్థానికులు మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని వారికి అండగా ఉండాలని కోరగా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో వారి కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేస్తామని వెంకటరమణారెడ్డి తెలిపారు.