calender_icon.png 6 March, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం

05-03-2025 01:12:50 AM

కూసుమంచి , మార్చి 4 (విజయ క్రాంతి): ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని లేప్రసి కాలనికి చెందిన సలవాది సైదమ్మ ఇటీవల గుండెనొప్పితో మృతి చెందారు.. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయం చేశారు.. అలాగే జలగంనగర్‌కి చెందిన గొట్టం సాంబయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని బాధితుడిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. పాలేరు ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు ప్రద్యుమ్న చారి, నాయకులు సంగయ్య, ఖాజా మియా, కళ్లెం శేష్ రెడ్డి, మోను పాల్గొన్నారు.