21-03-2025 05:58:07 PM
చిట్యాల,(విజయక్రాంతి): మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన మోత్కూరి కుమార్ ఇటీవల అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పదవ తరగతి 2000-2001 స్నేహితులు వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి, రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రాజు, ఆకుల సతీష్, తుమ్మ రమేష్ మోత్కూరి శ్రీశైలం, బోల్ల రాజేందర్, ఆరెపల్లి రాజు, రాజు, సకినాల ప్రభాకర్, పుల్ల శైలేందర్, కంచర్ల సతీష్, బండి అశోక్, రవీందర్, సతీష్, మహేందర్, బుర్ర రమేష్ గౌడ్, శ్రీధర్ సురేందర్, గట్టయ్య, బ్యాచ్ సమన్వయకర్త బోనగిరి తిరుపతి పాల్గొన్నారు.